»Sanjeev Goenka The Owner Of Lucknow Who Could Not Bear The Defeat Lashed Out At Kl Rahul The Video Is Viral
SRH vs LSG: ఓటమి తట్టుకోలేక కేఎల్ రాహుల్‌పై ఆగ్రహించిన లక్నో యజమాని.. వీడియో వైరల్!
ఎస్ఆర్ఎచ్తో తలపడిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ దారుణంగా ఓడిపోయిన సందర్భంగా ఆ ఫ్రాంచైజీ యజమాని కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై చిందులేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
Sanjeev Goenka, the owner of Lucknow, who could not bear the defeat, lashed out at KL Rahul.. The video is viral!
SRH vs LSG: ఐపీఎల్ సీజన్ 17 ఎలా కొనసాగుతుందో చూస్తూనే ఉన్నాము. అనుహ్యంగా ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు కనబరిచింది. మూడు సార్లు 250 దాటిన పరుగులు చేసి ప్రత్యర్థులకు ముంచెమటలు పట్టిస్తున్నారు. ఈ సందర్భంలో గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్ఎచ్ విరుచుకపడింది. దాంతో ఎల్ఎస్ఎజీ దారుణంగా ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ సేన కేవలం 165 పరుగులు మాత్రమే లక్ష్యాంగా ఇచ్చింది. రంగంలో దిగిన హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమిని లక్నో యజమాని సంజీవ్ గోయెంకా తట్టుకోలేకపోయారు. ఎల్ఎస్జీ డగౌట్ వద్ద కెప్టెన్‌పై ఆగ్రహించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
అయితే ఇది లైవ్‌లో టెలికాస్ట్ అవడం, దానిపై కామెంటర్లు సైతం స్పందించారు. స్టేడియంలో చాలా కెమరాలు ఉన్నాయి.. ఇలాంటి వ్యవహారం గదిలో చూసుకోండి అని సూచించారు. ఈ వీడియోలో సంజీవ్ గోయెంకా కోపంతో ఊగిపోతుంటే కేఎల్ రాహుల్ మాత్రం కూల్‌గానే ఉన్నాడు. ఈ వీడియోలో చూస్తే రాహుల్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు కానీ సంజయ్ వినిపించుకోవడం లేదు. ఈ ఘటన తరువాత కేఎల్ రాహుల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.