»Not A Single Vote Was Cast In Those Three Villages In Gujarat Do You Know Why
Boycott polling: గుజరాత్‌లోని ఆ మూడు గ్రామాల్లో ఒక్క ఓటు కూడా వేయలేదు.. ఎందుకో తెలుసా?
లోక్ సభ ఎన్నికల మూడోదశ పోలింగ్‌లో భాగంగా మంగళవారం గుజరాత్లో ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలోని మూడు గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బైకాట్ చేశారు. ఆ గ్రామాల్లోని బూత్‌లలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Not a single vote was cast in those three villages in Gujarat.. Do you know why?
Boycott polling: దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. దశల వారిగా పోలింగ్ జరుతుంది. అందులో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ నిర్వహించింది ఎన్నికల కమిషన్. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఈ పోలింగ్ నిర్వహించారు. అయితే గుజరాతోలో మొత్తం 26 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అందులో సూరత్ లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక అవడంతో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఓ మూడు గ్రామాల్లో జీరో పోలింగ్ నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక్కరు కూడా తమ ఓటును వినియోగించుకోలేదు. మరి కొన్ని గ్రామాల్లో చాలా తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి.
గుజరాత్ అంటే గుర్తుకు వచ్చేది బీజేపీనే, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి దిగ్గజాలు గుజరాత్ నుంచి వచ్చారు అన్న విషయం అందిరికీ తెలిసిందే. అయితే పోలింగ్‌ను బైకాట్ చేసిన గ్రామాలను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే కారణం అని తెలుస్తుంది. అందుకోసమే ఆ గ్రామాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకుని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలోని బరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామం, సూరత్ జిల్లాలోని సనధారా గ్రామం, బనస్కాంత జిల్లాలోని భఖారీ గ్రామాల్లోని ప్రజలు ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరి కోన్ని గ్రామాలు అయిన జునాగఢ్ జిల్లాలోని భత్గమ్ గ్రామం, మహిసాగర్ జిల్లాలోని బదోలీ, కుంజర గ్రామాల్లో తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి. దీనికి కారణం తమ గ్రామాల మధ్య నదిపై వంతెన నిర్మిస్తామని ఇచ్చిన మాట తప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.