NDL: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు ఇచ్చిన జీఓ 98 హామీ నెరవేర్చాలని నిర్వాసితుడు జయన్న డిమాండ్ చేశారు. నేడు నంది కొట్కూరులో 98GO బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకుంది. వారు మాట్లాడుతూ..32 మంది ఉద్యోగాల కోసం ఎదురు చూసి చనిపోయారని, ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇందులో బాధితులు పాల్గొన్నారు.