»This Is The Australian Team That Will Play For The T20 World Cup
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు ఆడబోయే ఆస్ట్రేలియా జట్టు ఇదే!
టీ20 ప్రపంచ కప్‌లో ఆడబోయే ఆస్ట్రేలియా టీమ్‌ను తాజాగా ప్రకటించారు. ముఖ్యంగా అనుభవానికే పెద్దపీట వేశారు. 2021లో వరల్డ్ కప్ గెలిచిన జట్టునుంచే భారీగా సభ్యులను తీసుకొన్నారు.
This is the Australian team that will play for the T20 World Cup!
T20 World Cup: జూన్ 1 నుంచి 29 వరకు ప్రపంచ టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ టోర్నీకి అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉండడంతో అన్ని దేశాలు తమ టీమ్‌లను ప్రకటిస్తున్నాయి. మంగళవారం బీసీసీఐ భారతీయ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా టీమ్‌ను ప్రకటించింది ఆస్ట్రేలియా క్రిెకెట్ బోర్డు. మిచల్ మార్ష్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ప్రకటించింది. 2021లో కప్ కొట్టిన టీమ్ సభ్యులలో ఈ ఏడాదికి 11 మందిని ఎంపిక చేయడంతో అనుభవానికే పెద్దపీట వేసినట్లు అనిపిస్తుంది.