Suicide : ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య? విజయవాడలో దారుణం!
విజయవాడలో ఓ ఆర్థోపెడిక్ వైద్యుడి కుటుంబం మొత్తం ఆత్మహత్యలకు పాల్పడింది. అయితే జరిగినవి హత్యలా? లేక ఆత్మహత్యలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Family Suicide In Vijayawada : విజయవాడలో ఓ వైద్యుడి కుటుంబంలో(DOCTOR FAMILY) ఉన్న మొత్తం ఐదుగురు మృతదేహాలుగా మారారు. అక్కడి గురునానక్ కాలనీలో ఈ దారునం చోటు చేసుకుంది. అయితే వారు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటంతో అవి హత్యలా? ఆత్మహత్యలా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
చదవండి :
విజయవాడ(VIJAYAWADA) నగరానికి చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడు శ్రీనివాస్. ఆయన మంగళవారం ఉదయం ఇంటి బయట ఉరేసుకుని మృతదేహంగా కనిపించారు. ఇంట్లో ఆయన భార్య ఉషారాణి, కుమారుడు శ్రీయాన్, కుమార్తె శైలజ, తల్లి రమణమ్మల మృతదేహాలు రక్తపు మడుగులో కనిపించాయి. దీంతో వైద్యుడు తొలుత వారిని హతమార్చి తర్వాత బయటకు వచ్చి ఉరేసుకుని ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి :
ఈ వైద్య కుటుంబానికి ఆర్థిక బాధలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. వాటిని తాళలేక ఆసుపత్రిని కూడా లీజ్‌కి ఇచ్చేశారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన శ్రీనివాస్ తొలుత కుటుంబ సభ్యుల గొంతు కోసి తర్వాత వచ్చి ఆత్మహత్య( SUICIDE) చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో ఉన్న మృత దేహాలు నాలుగూ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు.