»Bandi Sanjay Who Challenged The Congress Will Drop Out Of The Contest If The Evidence Shows That The Promises Have Been Fulfilled
Bandi Sanjay: కాంగ్రెస్‌కు సవాల్.. ఆధారాలు చూపిస్తే పోటీ చేయను
లోక్ సభ ఎన్నికల వేళా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రాష్ట్ర కాంగ్రెస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు అని పేర్కొన్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అలా నిరుపిస్తే తన నామినేషన్ వెనుకకు తీసుకుంటా అని తెలిపారు.
Bandi Sanjay, who challenged the Congress, will drop out of the contest if the evidence shows that the promises have been fulfilled
Bandi Sanjay: లోక్ సభ ఎన్నికల వేళా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, వందరోజుల్లో ఆరు గ్యారంటీలు పూర్తి చేయలేదని విమర్శించారు. తమ మెనిఫెస్టోనే ఖురాన్, బైబిల్, భగవత్ గీతా అని చెప్పారు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాలా మాటాలు చెప్పారు. ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు. కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయి. రైతులను నిండా ముంచారు. అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను నమ్మడం లేదని, ముఖ్యమంత్రి మాటలు తేలిపోయాయి అన్నారు.
ప్రచారంలో కాంగ్రెస్ అన్ని హామీలు నెరవేర్చినట్లు అబద్దాలు చెబుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు ఏం అయ్యాయి అన్నారు. మహిళలు 2500 ఇచ్చారని, వృద్ధులకు 4000 ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలు ఇచ్చారని ఆధారాలు చూపిస్తే తాను ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయను అని తెలిపారు. మీరు నిరుపించకుంటే మొత్తం 15 స్థానాలలో పోటీ నుంచి తప్పుకుంటారా అని అడిగారు. సోమావారం వరకు టైం ఉందని ఆలోపు తన సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉందా అని అన్నారు.