Breaking news: ఫార్మపరిశ్రమంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేస్తుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ట్రీ పక్కనే నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. దాని కారణంగానే నిప్పులు అంటుకున్నాయి అని కార్మికులు చెబుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానకిి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో లోపల ఉన్న కార్మికులు కిటికీల్లోంచి బయటకు దూకారు. కొందరు నిచ్చెనల సాయంతో బయటకు వస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.