Realme Realme C65 5G New Phone in Budget.. New Features
Realme: రియల్మీ మొబైల్ సంస్థ గురించి తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్టు అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులకు కొత్త మొబైల్స్ అందిస్తుంది. చైనాకు చెందిన ఈ మొబైల్ సంస్థ తాజాగా సి సిరీస్‌లో బడ్జెట్ ధరలో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అది రియల్మీ సీ65 5జీ (Realme C65 5G). దీనిలో ఎయిర్ గెశ్చర్స్ సదుపాయాన్ని కల్పించింది. ఇది మూడు వెరియంట్లలో లభిస్తుంది. అందులో 4జీబీ+64జీబీ వేరియంట్ ధర 10,499 గా నిర్ణయించింది. ఇక 4జీబీ +128జీబీ ధర రూ.11,499. అలాగే 6జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.12,499గా కంపెనీ పేర్కొంది. ఈ మొబైల్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఫెదర్ గ్రీన్, గ్లోయింగ్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది.
ఈ మొబైల్ కొనుగోలు చేసిన వారికి ఆఫర్ కూడా అందిస్తుంది. అందులో భాగంగా క్రెడిట్ కార్డుతో కొనేవారికి 4జీబీ వేరియంట్‌పై రూ.500, 6జీబీ వేరియంట్‌పై రూ.1,000 డిస్కౌంట్ కల్పిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. రియల్మీ సీ65 5జీ (Realme C65 5G) ఆండ్రాయిడ్ 14 (Android 14), యూఐ 5.0తో పనిచేస్తుంది. 6.67 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే.. 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ లభిస్తుంది. 50 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 5,000mAh.. 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.