ప్రతీసారి.. ఈసారి గట్టిగా కొడుతున్నామని చెబుతూ.. రౌడీ ఫ్యాన్స్‌కు భారీ ఆశలు కలిగిస్తున్నాడు విజయ్ దేవరకొండ. కానీ.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అవుతోంది. దీంతో ఇదంతా కావాలనే చేస్తున్నారా? విజయ్‌ని తొక్కెస్తున్నారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Vijay Devarakonda: లైగర్ సినిమా నుంచి విజయ్ దేవరకొండకు గట్టి ఎదురు దెబ్బ తాకింది. ఒకవేళ ఆ సినిమా హిట్ అయి ఉంటే.. ఈపాటికే పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోయేవాడు రౌడీ. కానీ లైగర్ ఫ్లాప్ అవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఖుషి సినిమాతో పర్వాలేదనిపించిన విజయ్ దేవరకొండ.. రీసెంట్గా ఫ్యామిలీ స్టార్‌తో మరోసారి ఫ్లాప్ అందుకున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్. కానీ స్టార్ డైరెక్టర్స్ ఎవరు కూడా విజయ్‌తో సినిమా చేయడానికి రెడీగా లేరు.
వాస్తవానికైతే.. స్టార్ డైరెక్టర్స్ చాలామంది విజయ్‌తో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. కథలు కూడా రెడీ చేసుకున్నారు, అనౌన్స్ కూడా చేశారు. కానీ ఆ సినిమాలను క్యాన్సిల్ చేసుకున్నారు. లైగర్ రిలీజ్‌కు ముందే అప్పుడెప్పుడో విజయ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు సుకుమార్. కానీ లోపు లైగర్ ఫ్లాప్ అవడం, పుష్ప హిట్ అవడంతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు సుకుమార్. పుష్ప2 తర్వాత రామ్ చరణ్‌తో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా విజయ్‌తో సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా విజయ్‌తో ఓ సినిమా చేయాల్సింది. కానీ ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ సెట్ అవలేదు. ఇలా విజయ్‌తో సినిమాలు చేయాల్సిన స్టార్ డైరెక్టర్స్ అంతా.. వేరే హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఒకవేళ విజయ్‌తో సినిమాలు చేసి ఉంటే.. ఈపాటికే పాన్ ఇండియా హీరోగా దుమ్ముదులిపేసేవాడు విజయ్. కానీ అలా జరగడం లేదు. బడా ప్రాజెక్ట్స్ చేజారిపోవడానికి తెరవెనక చాలా కథలే నడుస్తున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల మాట. కానీ రౌడీ మాత్రం తన పని తాను చేసుకుంటు పోతున్నాడు. మరి.. నెక్స్ట్ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.