Election commission: కేసీఆర్కు ఎన్నికల కమిషన్ నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నేతలపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారని, ఇష్టం వచ్చినట్లు తిట్టారన్న ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం వరకు ఆయన మాటలపై వివరణ ఇవ్వాలని తెలిపింది.
Election commission: దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చుక్కెదురైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 5 వ తేదీన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వీటిపై ఆయనకు ఈసీ నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల వరకు ఆ మాటలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
సిరిసిల్ల నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ..కరెంట్ పోయింది అని మాట్లాడితే నిరోధులో అమ్ముకోవాలని మాట్లాడుతున్నారు. లత్కోరుగాళ్లు, కుక్కల కొడుకులు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డిపై కూడా మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. దీంతో గత రాత్రి మాజీ సీఎంకు ఈసీ నోటీసులు ఇచ్చింది. అయితే ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ సభల్లో రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్, కేటీఆర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు.