పారిజాత పర్వం
సంతోష్ కుంభంపాటి దర్శకత్వంలో చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పారిజాత పర్వం. కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శరపంజరం
నవీన్ కుమార్ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం శరపంజరం. ఇందులో హీరోయిన్ లయ. ఈ చిత్రం ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదల కానుంది.
మారణాయుధం
మాలాశ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రూపొందిన చిత్రం మారణాయుధం. ఈ సినిమాకి గురుమూర్తి సునామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది.
లవ్ యూ శంకర్
రాజీవ్ ఎస్.రియా దర్శకత్వంలో లవ్ యూ శంకర్ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రేయాస్ తల్పాడే, తనీషా ముఖర్జీ జంటగా నటించారు.