»Huge Set For Salar 2 Is This The Highlight Of The Movie
Prabhas: ‘సలార్ 2’ కోసం భారీ సెట్.. సినిమాలో ఇదే హైలెట్?
ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమాల్లో సలార్ 2 పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ సెట్టింగ్ వేస్తున్నారట. సినిమాలో ఈ సీక్వెన్స్ హైలెట్‌గా నిలవనుందట.
Huge set for 'Salar 2'.. Is this the highlight of the movie?
Prabhas: వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కు సలార్ సినిమా సాలిడ్ హిట్ ఇచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేసింది. ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్‌కు పండగ చేసుకున్నారు డార్లింగ్ అభిమానులు. బాహుబలి తర్వాత ఈ పాన్ ఇండియా కటౌట్‌ను ఎంత వరకు వాడుకోవాలో.. అంతవరకు పర్ఫెక్ట్గా వాడుకున్నాడు ప్రశాంత్ నీల్. అందుకే సలార్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ క్లైమాక్స్‌లో సీక్వెల్‌గా సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనౌన్స్ చేశాడు ప్రశాంత్ నీల్. ఈ సమ్మర్లోనే సలార్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే రంగంలోకి దిగిపోయారు మేకర్స్. ప్రస్తుతం ఒక భారీ సెట్‌ను వేస్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం భారీ స్విమ్మింగ్ పూల్ సెట్‌ను వేస్తున్నారట. ఈ సీక్వెన్స్ సముద్రం బ్యాక్ డ్రాప్లో ఉంటుందని సమాచారం. అంటే.. సముద్రంలో జరగబోయే ఊచకోత మామూలుగా ఉండదనే చెప్పాలి.
అంతేకాదు.. ఈ స్విమ్మింగ్ పూల్‌లో కృత్రిమ అలలను కూడా ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో ఈ సీక్వెన్స్ హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం. త్వరలోనే సలార్ 2 షూటింగ్ మొదలు కాబోతోంది. అల్రేడీ పార్ట్ 1తో పాటు షూట్ చేసిన కొంత ఫుటేజ్ ఉంది కాబట్టి.. వీలైనంత త్వరగా సలార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసి.. 2025లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా సలార్ పార్ట్ వన్ 700 కోట్ల దగ్గరే ఆగింది కానీ.. పార్ట్ 2 మాత్రం వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందనే అంచనాలున్నాయి. మరి శౌర్యాంగ పర్వం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.