E.G: రైతుల కోసం ఫసల్ బీమా యోజన’లో నమోదుకు గడువును పొడిగించారు. వరదలు, తుపాన్లు, అధిక వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, పంట తెగుళ్లు, చీడపీడల కారణంగా రైతులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎస్బీవై) అమలు చేస్తుంది. ఈ పథకంలో నమోదుకు ప్రీమియం చెల్లింపు తేదీ ఈనెల 31వ తేదీ వరకు పెంచినట్లు అధికారులు తెలిపారు.