SRD: మనూర్ మండలంలోని బోరంచ జడ్పీహెచ్ఎస్ గెజిటెడ్ హెచ్ఎంగా శివకుమార్ స్వామి గురువారం నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖేడ్ మండలం అబ్బెంద గ్రామానికి చెందిన శివకుమార్ స్వామి ప్రస్తుతం సంజీవన్రావుపేటలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.