VZM: శ్రావణమాసంలో ఆఖరి శుక్రవారం సందర్బంగా ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడిమాంబకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ మేరకు చదురుగుడి వద్ద వెలసిన శ్రీ పైడిమాంబ శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, పండ్లతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.