NLR: నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్‌ను అధికారులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. భద్రతా కారణాలు దృష్ట్యా ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. ఉదయం 6:30 సమయంలో విశాఖ జైలుకు అతను చేరుకున్నాడు. పెరోల్ రద్దు వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అతన్ని వేరే జైలుకు తరలిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అతన్ని విశాఖ తరలించారు.