»Delhi Cm Arvind Kejriwal Lost 4 5 Kg Weight In One Day In Tihar Jail
Arvind Kejriwal: జైలులో ఒక్కరోజులోనే 4.5 కిలోల బరువు తగ్గినన కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీల్యాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు షూగర్ లెవల్స్ కూడా భారీగా పడిపోయాయి అని ఒక్కరోజులోనే 4.5 కిలోల బరువు తగ్గారని ఆ పార్టీ నేతలు తెలిపారు.
Delhi CM Arvind Kejriwal lost 4.5 kg weight in one day in Tihar Jail
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ రూపకల్పన విధానంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన జైలులో గడిపిన ఒక్కరోజులోనే విపరీతంగా బరువు కోల్పోయినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. తమకు జైలు అధికారుల తెలిపారని కేజ్రీవాల్ ఒక్కరోజులోనే 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ నేతలు చెప్పారు. అంతే కాదు ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదని, మధుమేహంతో బాధపడుతున్న ఆయన షుగర్ లెవల్స్ కూడా ఆకస్మాత్తుగా పడిపోయాయి అని వారు వెల్లడించారు. అయితే, కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని, జైలు డాక్టర్ అందుబాటులో ఉండీ ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నారని జైలు అధికారులు తెలిపారు. ఆయనకు బ్లడ్ షుగర్ లెవల్స్ 50 కి పడిపోవడంతో డాక్టర్లు వెంటనే మందులు ఇచ్చారని, ప్రస్తుతం ఆయన సాధారణ స్థితిలో ఉన్నట్లు తెలిపారు. షుగర్ లెవల్స్ పడిపోకుండా టోఫీస్ (చాక్లెట్లు) ఇచ్చినట్లు తెలిపారు.
ఆయన ఆరోగ్యం మాములు స్థితికి వచ్చేంత వరకు ఇంటి నుంచే ఆహారాన్ని అందించవచ్చని కోర్టు వెసులబాటు కల్పించింది. ఈ కేసులో 15 రోజుల పాటు ఏప్రిల్ 1 నుంచి 15 తేదీ వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తీహార్ జైలు నెంబర్ 2 లో కేజ్రీవాల్ కు స్పెషల్ సెల్ కేటాయించిన అధికారులు.. కోర్టు ఆదేశాల మేరకు పలు సౌకర్యాలు కల్పించారు. 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. చర్యలు తీసుకున్నారు. కేజ్రీవాల్ కోరిన పుస్తకాలు కూడా అందించామని తెలిపారు.