»Huge Earthquake In Taiwan Tsunami Warnings For Many Areas Including Japan
Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
తైవాన్ రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. జపాన్ సహా మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 25 ఏళ్ల తరువాత ఇదే భారీ భూకంపంగా అధికారులు ప్రకటించారు.
Huge earthquake in Taiwan. Tsunami warnings for many areas including Japan
Taiwan: తైవాన్(Taiwan) రాజధాని తైపీలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున ప్రజలు ఉలిక్కిపడ్డారు. పెద్ద శబ్దంతో భారీ భూకంపం రావడంతో వణికిపోయారు. జపాన్ సహా పలు తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. తైవాన్ దేశ భూ కంపన పర్యావేక్షణ సంస్థ రిక్టరా స్కేల్‌పై ప్రకంపనాల తీవ్రతను 7.2 గుర్తించింది. అమెరికాకు జియోలాజికల్ సర్వే రిక్టారు స్కేల్‌పై 7.4గా గుర్తించింది. దక్షిణ తైవాన్‌లోని హులియన్ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూఅంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
భూమి కంపించడంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. గత 25 ఏళ్లలో ఇలాంటి భూకంపాన్ని చూడలేదని అధికారులు తెలిపారు. దీంతో జపాన్ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్‌లోని ఒకినావా దీవుల్లో సుమారు 3 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. భూకంపం వచ్చిన 15 నిమిషాలకు యొనగుని ద్వీపాన్ని భారీ అలలు తాకినట్లు తెలిపింది. సునామీ మొదటి అల ఇప్పటికే మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు జపాన్ పేర్కొంది. సునామీ వచ్చే అవకాశం ఉంది అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని తీరప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే తైవాన్‌లో భూకంపాలు వస్తూనే ఉంటాయి. 1996లో రిక్టారు స్కేల్‌పై 7.6 తీవ్రతతో 2400 మంది మరణించారు.
🚨🇹🇼 Building Collapse in Taiwan Due to Earthquakes | Visible Structural Damage