»Cm Revanth Reddy Was The First To Respond To Brs Phone Tapping
CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యభర్తల మాటలు విన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తొలిసారి సీఏం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏం అవుతుందని కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. త్వరలోనే చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటారు అని అన్నారు.
CM Revanth Reddy was the first to respond to BRS phone tapping
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏం అవుతుందని కేటీఆర్ అచ్చుసోన అంబోతులా మాట్లాడుతున్నారని, ఇలానే మాట్లాడితే చర్లపల్లి జైలులో చింపకూడు తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ తాగుబోతులా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఫోన్ ట్యాపింగ్ చేసి భార్య భర్తల సంభాషణలు విన్నారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో పాలమూరును దెబ్బతీసే కుట్ర జరుగుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటయ్యాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అలంపూర్, గద్వాల్ ఏరియాలో బోయలు ఎక్కువగా ఉంటారని వారి గురించి తనకు బాగా తెలుసు అని అన్నారు.
ఈ ఎన్నికల్లో వారంత ఏకం కావాలి అని పిలుపునిచ్చారు. గద్వాల్ అభివృద్దికి పాటుపడుతదని నమ్మితే డీకే అరుణ చేసింది ఏంటని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు ఆమె జాతియ హోదా తీసుకురావచ్చు కదా అని అన్నారు. ఆమెకు పదవులు ఉంటే చాలని ప్రజల గురించి పట్టించుకోదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మన ప్రభుత్వమే ఉందని, ఢిల్లీలో కాంగ్రెస్ పీఠం ఎక్కుతుందని ఎన్నికల కోడ్ అయిపోగానే బోయ, వాల్మికీల అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని అన్నారు. ఈ లోక్ సభ ఎన్నిక్లో మహాబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి బరిలో ఉన్నారు అని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటును వినియోగించుకోవడం అత్యవసరం అని అందుకే తాను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికలకు హాజరయ్యి ఓటు వేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.