»A Case Has Been Registered Against Former Brs Mp Joginapalli Santosh Kumar
Joginapalli Santosh Kumar: మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదు
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై కేసు నమోదు అయింది. భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
A case has been registered against former BRS MP Joginapalli Santosh Kumar
Joginapalli Santosh Kumar: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌పై కేసు నమోదు అయింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్‌పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జోగినపల్లి సంతోష్ కుమార్ పై నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవయుగ సంస్థ బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని సర్వే నెం.129/54లో 1,350 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది.
అయితే, నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జోగినపల్లి సంతోష్ కుమార్, లింగారెడ్డి శ్రీధర్ లపై నవయుగ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. దీంతో సంతోష్ కుమార్, శ్రీధర్లపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. దీనిపై సంతోష్ స్పందించాడు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని అన్నారు. న్యాయపరమైన అంశాలుంటే నోటీసులు ఇవ్వాలని, కావాలనే తమ పార్టీపై కక్షతో బురద జల్లాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ కేసు నిలబడదని తాను చట్టపరంగానే ఆ భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు.