SRPT: వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని, మార్కెట్ ఛైర్మెన్ బెల్లంకొండ విజయ లక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేడారం పరిసర ప్రాంత రైతులు పశుపోషకులు, పశువులకు చికిత్స చేయించుకుని పశు వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోవాలన్నారు.