చిన్న సినిమాగా మొదలైన కాంతార.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో కాంతార 2ని భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తోంది హోంబలే ఫిలింస్. తాజాగా కాంతార.. ఏ లెజెండ్ చాప్టర్ 1 హీరోయిన్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
Rukmini Vasant: కాంతార సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సెన్సేషన్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. 15 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవల్లో ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టింది. దీంతో రెట్టించిన ఉత్సాహం, భారీ బడ్జెట్‌తో కాంతార 2 చేస్తున్నాడు రిషబ్ శెట్టి. హోంబలే ఫిలిమ్స్ వారు దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. ఇది కాంతార ప్రీక్వెల్‌గా రాబోతోంది. కాంతార.. ఏ లెజెండ్ చాప్టర్ 1 టైటిల్‌తో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇందులో కాంతార ప్రీక్వెల్‌ను చూపించబోతున్నారు. గత కొన్ని నెలలుగా రిషబ్ శెట్టి ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. కాంతార సినిమాలో సప్తమీ గౌడ హీరోయిన్గా నటించింది. అయితే ప్రీక్వెల్‌లో మాత్రం ‘సప్తసాగరాలు’ చిత్రంలో నటించిన రుక్మిణి వసంత్‌ని ఫైనల్ చేసినట్టుగా సమాచారం. ఇటీవలే ఈ బ్యూటీ లుక్ టెస్ట్‌లో కూడా పాల్గొందని టాక్. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే కన్నడలో కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం కన్నడలో ముడు నాలుగు సినిమాలు చేస్తోంది. అయితే.. ఈ బ్యూటీ ‘సప్తసాగరాలు’ డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగు ఆడియెన్స్‌కు కూడా పరిచయమైంది. అమ్మడి అందానికి ఫిదా అయిపోయిన తెలుగు మేకర్స్.. ఇక్కడ కూడా ఆఫర్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది రుక్మిణి. ఇక్కడి నుంచి అమ్మడి కెరీర్‌కు ఢోకా లేదనే చెప్పాలి.