Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ డ్రగ్స్ వినియోగించినట్లు ఒప్పుకున్నారు. మానసికంగా కుంగుబాటు నుంచి బయటపడేందుకు కెటమిన్ అనే డ్రగ్‌ను వైద్యుడి సూచనలతో తీసుకున్నట్లు మస్క్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే రెండు నెలల క్రితం మస్క్ డ్రగ్స్ వాడకంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. వివిధ ప్రాంతాల్లో జరిగే పార్టీల్లో మస్క్ తరచుగా పాల్గొంటూ.. నిషేధిత డ్రగ్స్‌ను తీసుకుంటున్నారని తెలిపింది. దీంతో టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల బోర్డు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనిపై మస్క్ చెప్పడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.
గతంలో మెదడులో సంభవించిన మార్పుల వల్ల మస్క్ మానసిక కుంగుబాటుకు గురయ్యారు. ఆ సమయంలో దాన్ని నుంచి బయటపడేందుకు కెటమిన్ తనకు బాగా ఉపయోగపడిందని మస్క్ తెలిపారు. వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి చిన్న మొత్తంలో దాన్ని తీసుకునేవారని మస్క్ తెలిపారు. అప్పట్లో రోజుకు 16 గంటలు పనిచేయడంతో చాలా ఒత్తిడి ఉండేదని మస్క్ తెలిపారు. ఎక్కువ కాలం నేను మానసిక కుంగుబాటులో ఉంటే టెస్లా పనితీరుపై ప్రభావం పడుతుంది. దానిని అధిగమించేందుకే కెటిమిన్ తీసుకున్నానని మస్క్ తెలిపారు. ఒకవేళ పరిమితి మించి ఉపయోగిస్తే ఏ పని కూడా సక్రమంగా పూర్తి చేయలేరని మస్క్ తెలిపారు.