మెగా డాటర్ నిహారిక చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తనకు ఆ పిచ్చి ఎక్కువైందని.. అలా చేయడ అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇంతకీ నిహారిక చెప్పింది దేని గురించో తెలుసా?
Niharika: విడాకుల తర్వాత మరింత జోష్‌తో దూసుకుపోతోంది మెగా డాటర్ నిహారిక. హీరోయిన్గా నిర్మాతగా సత్తా చాటడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తోంది నిహారిక. ఈ బ్యానర్ పై ఓటీటీకి కంటెంట్ అందిస్తోంది. అలాగే.. ఓ మళయాళం సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. వాట్ ది ఫిష్ అనే ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసింది. అంతేకాదు.. హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తోంది. ఆహా ఓటిటిలో చెఫ్ మంత్ర సీజన్ 3కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. మార్చి 8 న ఈ షో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కూడా అయ్యింది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘ఈ మధ్య నాకు తిండి పిచ్చి ఎక్కువైంది.. ముఖ్యంగా పప్పుచారు కనిపిస్తే అస్సలు వదలడం లేదు. అలాగే ఎక్కువగా ట్రావెలింగ్కు వెళ్తున్నాను. ఏది కూడా కావాలని ప్లాన్ చేసుకొని వెళ్లడం లేదు. కానీ.. ఈ ట్రావెలింగ్కు అయ్యే ఖర్చుని మాత్రం నేనే దాచుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అలాగే.. నాకు మంచి సినిమాలు చేయాలని ఉంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో నటించాలని ఉంది. కానీ, ఏ డైరెక్టర్ కూడా నాకు అలాంటి పాత్రలు ఆఫర్ చేయడంలేదు. అలాంటి రోల్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. నేను పెద్దింటి అమ్మాయిని కాబట్టి ఆడిషన్స్ చేయడం ఏంటీ? అని నేను అనుకోను. కానీ ఆడిషన్స్ ఇవ్వడమంటే నాకు చాలా ఇష్టం.. అని చెప్పింది. మరి నిహారికకు కమర్షియల్ ఆఫర్స్ ఎవరిస్తారో చూడాలి.