కర్నూలు: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేసి, కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద న్యాయవాదులు మానవహారం, ధర్నా నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న న్యాయవాది ఎం. పవన్ కుమార్‌పై అనుచితంగా ప్రవర్తించిన ఘటనను ఖండిస్తూ పెద్ద ఎత్తున న్యాయవాదులు ఆందోళనకు దిగారు.