For the first time in the history of Pakistan.. a Sikh leader as a minister
Pakistan: పాకిస్థాన్ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. మాములుగా పాకిస్థాన్‌లో హిందూ, సిక్కు, క్రిస్టియన్ తదితర మైనార్టీలకు అత్యున్నత పదవులకు చేరుకోవడం కష్టమైన పని. అలాంటిది ఒక సిక్కు నేత పాకిస్థాన్‌లో తొలి సిక్కు మంత్రిగా ఎంపికయ్యారు. సర్దార్ రమేశ్ సింగ్ అరోరా పంజాబ్ ప్రావిన్స్‌లో మైనార్టీ వ్యవహారాల మంత్రిగా ఎన్నికయ్యారు.
పాకిస్థాన్ మైనార్టీ నాయకుల్లో రమేశ్ సింగ్ అరోరా ఒక శక్తివంతమైన లీడర్. నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్, నవాజ్ పార్టీ నేత రమేశ్ సింగ్ ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో గెలిచి మూడోసారి పంజాజ్ ప్రావిన్స్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే రమేశ్‌కు పాక్ ఆర్మీతో మంచి సంబంధాలు ఉన్నట్టు సమాచారం. 2016లో పాకిస్థాన్ అధ్యక్షుడి చేతుల మీదుగా ఆయన మానవహక్కుల అవార్డును అందుకున్నారు. 1974 అక్టోబర్ 11న నరోవల్ జిల్లా నన్కానా సాహిబ్ లో జన్మించారు. 2013లో 63 సంవత్సరాలలో పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికైన మొదటి సిక్కు ఆయన.