NLR: వలేటివారిపాలెం 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో కొత్త వీసీబీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ మధుబాబు తెలిపారు. పనుల కారణంగా వలేటివారిపాలెం, పోలినేనిపాలెం, ఉప్పలపాడు, లింగపాలెం గ్రామాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన పేర్కొన్నారు.