ఏపీ స్పోర్ట్స్ శాఖ మంత్రి రోజా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సభ్యురాలిగా నియమితులైనట్లు వెల్లడించింది. ఆర్కే రోజాతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడా శాఖ మంత్రులకు కూడా సాయ్ సభ్యులుగా అవకాశం దక్కింది. సాయ్ లో రోజా దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కార్యదర్శి జతిన్ నర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సాయ్ అధ్యక్షుడిగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి కొనసాగుతారని ఆయన తెలిపారు.
సాయ్ లో తనకు సభ్యత్వం లభించడంపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. అరుదైన అవకాశం లభించినందుకు రోజా సంతోషంగా వ్యక్తం చేశారు. మెరుగైన రీతిలో సేవలు అందిస్తానని ఆమె తెలిపారు. రోజా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు. మరో కొత్త బాధ్యత తనకు ఇవ్వటం పట్ల రోజా ఆనందం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తానని తెలిపారు.