ఏపీ సీఎం వైఎస్ జగన్ రాత్రి 9 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయన సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరినా ఆయన ప్రయాణించే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులో అత్యవసర లాండింగ్ చేశారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే సీఎం జగన్ ఉండిపోయారు. రేపు గ్లోబర్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో సీఎం పాల్గొనాల్సి ఉంది. అందుకే మరో ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి సీఎం జగన్ రాత్రి 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు.