»Supreme Court Sanatana Dharma Udayanidhis Comments Of The Supreme Court
Supreme Court: సనాతన ధర్మం ఉదయనిధి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు!
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పలు రాష్ట్రల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Supreme Court: డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై పలు రాష్ట్రల్లో కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్ఐఆర్లన్నింటినీ కలిపి విచారించాలంటూ ఉదయనిధి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం ఆ వ్యాఖ్యలను తప్పబట్టింది.
వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ కింద ఉన్న మీ హక్కులను దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మీరే రక్షణ కోసం సుప్రీంకోర్టుకు వచ్చారు. మీరేం సామాన్య పౌరుడు కాదు. ఓ మంత్రి పదవిలో ఉన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియదా? అని సుప్రీంకోర్టు మండిపడింది. దీని తదుపరి విచారణను మార్చి 15వ తేదీకి వాయిదా వేసింది.
గతేడాది జరిగిన సనాతన నిర్మూలన కాన్ఫరెన్స్లో భాగంగా ఉదయనిధి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకంగా ఉంటుందని కొన్నింటిని వ్యతిరేకించి ఊరుకోకూడదని, వాటిని నిర్మూలించాలని పిలుపునిచ్చారు. డెంగ్యూ, మలేరియా, దోమలు, కరోనా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదని పూర్తిగా నిర్మూలించాలన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.