Uttar Pradesh: దంపతుల మధ్య చీర సమస్య కోర్టుకు వరకు తీసుకెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన దీపక్ అనే వ్యక్తికి హత్రాస్‌కు చెందిన యువతితో కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత దీపక్ తన భార్య కోసం చాలా చీరలు కొని తీసుకొచ్చాడు. అయితే ఆ చీరలు భార్యకు నచ్చలేదు. కానీ దీపక్ మాత్రం ఆ చీరలే కట్టుకోవాలనేవాడు. దీనికి భార్య నిరాకరించేంది. ఇలా ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయ్యింది.
తనకు నచ్చిన చీరలే కట్టుకోమని భర్త .. నాకు నచ్చని చీరలు నేనెందుకు కట్టుకుంటానని భార్య పంతానికి పోయింది. ఇద్దరూ ఈగోకి పోయారు. దీంతో గొడవలు ఇంకా పెరగసాగాయి. ఇరు కుటుంబాల పెద్దలు కలగజేసుకుని నచ్చచెప్పారు. అయిన లాభం లేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్యభర్తలిద్దరినీ కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లారు. అయినా వీరిద్దరి మధ్య గొడవలు తగ్గలేదు. దీంతో ఇద్దరూ విడాకులు కోరుతూ ఆగ్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది.