Janhvi Kapoor: బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో తన కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor) తన కెరీర్లో చాలా బాగా రాణిస్తోందని, ఆమె సూర్య , రామ్ చరణ్‌లతో చిత్రాలకు సంతకం చేసిందని అధికారికంగా ధృవీకరించారు. నిర్మాత వైపు నుండి లేదా రామ్ చరణ్(ramcharan), సూర్య చిత్ర యూనిట్ల నుండి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈలోగా బోనీ మీడియా ముందు ఈ వార్తను అధికారికంగా ప్రకటించాడు.
తాజా ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ ఈ ప్రకటనలపై స్పందిస్తూ, “మా నాన్న ఎవరినీ సంప్రదించకుండా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు, వీటి గురించి మాట్లాడటం చాలా తొందరగా ఉందని నేను భావిస్తున్నాను. దీని గురించి బోనీ కపూర్ తనతో లేదా ఏ నిర్మాతతో మాట్లాడలేదని తెలిపింది. బోనీ కపూర్ ఆ చిత్రాలను ప్రకటించడం ద్వారా తప్పు చేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా ప్రతి అంశాన్ని ధృవీకరించిన తర్వాత విషయాలను అధికారికంగా ప్రకటిస్తారు. కానీ తన తండ్రి వ్యాఖ్యలపై జాన్వీ కపూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.