Nikhil Siddartha: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రి అయ్యాడు. ఆయన భార్య పల్లవి ఈరోజు ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. హీరో నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చాలామంది సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నిఖిల్, పల్లవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిఖిల్ డాక్టర్ పల్లవిని 2020లో ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
వీరి వివాహం కోవిడ్ సమయంలో కావడంతో కొద్దిమంది సమక్షంలో మాత్రమే అయ్యింది. హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభు చిత్రంలో నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. రాజుల కాలం నాటి బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం ఉండనుంది. యోధుడిగా ఈ చిత్రంలో నిఖిల్ కనిపించనున్నారు. స్వయంభు నుంచి వచ్చిన నిఖిల్ ఫస్ట్ లుక్ అంచనాలను అమాంతం పెంచేసింది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.