»Hanging Issues In Your Phone Everything You Need To Know
Phone Hanging : మీ ఫోన్ తరచుగా హ్యాంగ్ అవుతోందా? ఇలా చేసి చూడండి !
కొంత మంది మొబైల్ ఫోన్లు చాలా స్లోగా ఉంటాయి. తరచుగా హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. ఫోన్లో చిన్న చిన్న విషయాలను సరి చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
Phone Hanging Problem : మొబైల్ ఫోన్ లేనిదే మనకు రోజు గడవదు. బ్యాంకింగ్‌లు, షాపింగ్‌లు, ఛాటింగ్‌లు… అన్నీ దీనిలోనే. అందుకనే కొన్ని సార్లు మన ఫోన్(Phone) మొరాయిస్తుంటుంది. హ్యాంగ్(Hang) అయిపోయి వేగంగా రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నట్లు తయారవుతుంది. అలాంటప్పుడు ఫోన్లో కొన్నింటిని సెట్ చేసుకోవడం, కొన్నింటిని క్లియర్ చేయడం చేస్తే పని సులువు అవుతుంది. తిరిగి మన ఫోన్ వేగాన్ని పుంజుకుంటుంది. అందుకు ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
మన వాడకానికి తగినట్లుగా ఫోన్లో మెమొరీ ఉండేలా చూసుకోవాలి. ఒక వేళ చాటింగ్ యాప్‌ల నుంచి అనవసరమైన ఫైల్స్ కూడా డౌన్లోడ్ అయిపోయి ఫోన్లో పేరుకుపోతున్నాయేమో చెక్ చేసుకోవాలి. అవసరమైనవే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ని ఎంచుకోవాలి. అనవసరమైన డాటా, ఫోటోలను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తూ ఉండండి. ఇది నిత్యం చేస్తూనే ఉండాలి.
ఫోన్ విపరీతంగా హ్యాంగ్ అయిపోయి ఇబ్బంది పెడుతుంటే ఒకసారి ఫ్యాక్టరీ రీసెట్ కొట్టేయండి. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్లో ఉన్న డాటా అంతా పోతుందని మాత్రం గుర్తుంచుకోవాలి. అవసరమైనవి ఏమైనా ఉంటే వాటిని మీ కంప్యూటర్లో ఎక్కడైనా దాచుకుని అప్పుడు రీసెట్ చేయండి. అలాగే అనవసరంగా ఉన్న యాప్‌లను తొలగించేయండి. మాల్ వేర్ ఉందేమో స్కాన్ చేసి చూసుకోండి. యాప్ క్యాచీలను క్లియర్ చేసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల దాదాపుగా సమస్య పరిష్కారం అవుతుంది. లేని పక్షంలో సర్వీస్ సెంటర్లో ఒకసారి చూపించాల్సి వస్తుంది.