అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ అబ్బాయిలు ఉంటారు. వాళ్లను చూసి కొంచెం ఎక్స్ట్రా చేస్తుంటారు. అది ఎక్కడైనా కామనే. కానీ.. అది శృతి మించితేనే అసలు సమస్య. తాజాగా అటువంటి ఘటనే ఒకటి రైలులో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు రైలులో పక్కన అమ్మాయిలను చూసి రెచ్చిపోయారు. వాళ్ల ముందు పోజులు కొట్టారు. ఆ తర్వాత ఇద్దరూ వాళ్ల ముందు సిగరెట్ వెలిగించి అమ్మాయిలను చూస్తూ వెకిలి చేష్టలు చేశారు. అక్కడ అమ్మాయిలతో పాటు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ల వద్దు అన్నా కూడా వినకుండా సిగరెట్ తాగుతూ అక్కడున్న వాళ్లపై దురుసుగా ప్రవర్తించారు.
ఈ ఘటనను పక్కనే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 14322 నెంబర్ రైలులో ఎస్ 5 కోచ్, సీటు నెంబర్ 39, 40 లో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ ఆ వీడియోను రైల్వే శాఖకు ట్యాగ్ చేశాడు. దీంతో రైల్వే అధికారులు వెంటనే స్పందించారు. మీ మొబైల్ నెంబర్ పంపించండి. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. మాకు పూర్తి వివరాలు కావాలి అంటూ రైల్వే శాఖ స్పందించింది. అయితే.. తర్వాతి స్టేషన్ లో ఆర్పీఎఫ్ పోలీస్ వచ్చి ఆ ఇద్దరు యువకులకు వార్నింగ్ ఇచ్చినట్టు ఓ నెటిజన్ ఆ వీడియోకు కామెంట్ చేశాడు. వాళ్లకు వార్నింగ్ కాదు.. ఫైన్ వేసి రైలు నుంచి దింపేయాలి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
@IRCTCofficial@RailMinIndia Passengers Lighting Cigarettes in front of Kids & Senior Citizen and abusing when all are stopping them., Train No 14322 Coach S-5 Seat Number’s 39-40. Please take action as soon as possible pic.twitter.com/kxQJUDc72T