టమాటాలు పండించే రైతులు(Tomato Farmers) లాభాల బాట పడుతున్నారు. తాజాగా వాటి ధరలు భారీగా పెరగడంతో మహారాష్ట్ర(Maharashtra)లోని ఇద్దరు రైతులు కోటీశ్వరులు అయ్యారు. వ్యవసాయంలో కోట్లు సంపాదించడంతో చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నెల రోజుల్లోనే ఇద్దరు రైతులు కోటీశ్వరులు అయ్యారు. అది కూడా టమాటా రైతులు కావడం విశేషం.
మహారాష్ట్ర(Maharashtra)లోని పుణె జిల్లా(Pune district)లో తుకారాం భాగోజి గాయకర్ (Tukaram Bhagoji Gayakar)అనే రైతు టమాటాలను అమ్మి కోటీశ్వరుడయ్యాడు. తనకున్న 18 ఎకరాల వ్యవసాయ భూమిలో 12 ఎకరాల్లో టమాటా పంట వేశారు. పంట చేతికొచ్చే సమయానికి టమాటాల ధరలు రోజుకోరీతిగా పెరగటంతో కేవలం నెల రోజుల్లోనే రూ.కోటిన్నరకు పైగా ఆదాయాన్ని పొందాడు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)ధమ్తరీ జిల్లా( Dhamthari District)లోని బీరన్ గ్రామానికి చెందిన అరుణ్ సాహూ( Arun Sahu) అనే రైతు కూడా టమాటాలు అమ్మి కోటీశ్వరుడయ్యాడు. తనకున్న 150 ఎకరాల్లో టమాటాను సాగు చేసి రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించేవాడు. అలా కేవలం జులై నెల సగం రోజులకే రూ.కోటికి పైగా సంపాదించాడు.
అలాగే కర్ణాటక(Karnataka)లోని కోలార్‌కు చెందిన ఓ రైతు కుటుంబం ఒక వారంలో 2,000 టమాట పెట్టెలను అమ్మి లక్షాధికారులయ్యింది. ఈ వారం రోజుల్లోనే ఆ రైతు కుటుంబం రూ.38 లక్షలను పొందింది. దేశ వ్యాప్తంగా టమాటాలు పండించిన రైతులు మంచి ఆదాయాన్ని పొందుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.