stray dog eating in patient food govt hospital video viral
Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఏదో వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటన గురించి చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో వీధికుక్క పేషేంట్ ఆహారం తింటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషేంట్కి ఉచితంగా ఆహారం ఇస్తారు. పేషేంట్ ఆ ఆహారాన్ని పక్కన పెట్టి నిద్రపోయాడు. లోపలికి వచ్చిన కుక్క పేషేంట్ ఆహారాన్ని తింటున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) వరకు వెళ్లగా.. వెంటనే సీఎంఓ(CMO) ఈ ఘటన గురించి విచారణ జరపమని హాస్పిటల్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (CMS)కు ఆదేశించారు. ఈ ఘటనపై CMO కులదీప్ సింగ్ మాట్లాడుతూ.. ఆసుపత్రి పరిధిలోకి జంతువులు వచ్చే అవకాశం ఉండదు. ఎలా వచ్చిందో తెలియదు. ఈ ఘటనపై విచారణ చేయమని ఆదేశించానని తెలిపారు.