ఓ వ్యక్తి కసాయిలా మారాడు. తనతో సహజీవనం చేసే మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికడమే కాకుండా వాటిని కుక్కర్లో వేసి ఉడికించాడు. ఆమె శరీర భాగాలను చూసి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఈ అతి దారుణ ఘటన ముంబైలోని మీరా రోడ్డులో చోటుచేసుకుంది.
మనోజ్ సహానీ(56), సరస్వతి వైద్య(36) గత మూడేళ్ల నుంచి సహజీనం చేస్తున్నారు. మీరీ రోడ్డులోని గీతా ఆకాశ్ దీప్ అనే భవనంలో వీరు నివాసం ఉంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి మనోజ్, సరస్వతిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు మూడ్రోజుల క్రితం ఆ గొడవలు ఇంకాస్త ఎక్కువయ్యాయి. తారాస్థాయికి చేరిన ఆ గొడవల్లో సరస్వతిని ఆ క్రూరుడు కత్తితో అతి దారుణంగా హత్య చేశాడు.
కత్తితో నరికిన సహానీ ఆ తర్వాత అంతటితో ఊరుకోలేదు. చెట్లను కత్తిరించే యంత్రంతో ఆమె శరీర భాగాలను ముక్కులుగా చేశాడు. ఆ తర్వాత వాటిని కుక్కర్లో ఉడికించి పైశాచిక ఆనందాన్ని పొందాడు. బుధవారం సాయంత్రం వారుండే ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని షాక్ అయ్యారు. మహిళ శరీర భాగాలను, కుక్కర్‌ను, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు మనోజ్ సహానీని అరెస్ట్ చేశారు.