ముంబై (Mumbai) నగరంలో ఓ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఎన్సీసీ (NCC) సీనియర్ క్యాడెట్ జూనియర్ని ఉన్మాదంగా కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. థానే(Thane)లో ఉన్న ఒక కాలేజీకి సంబంధించిన వీడియో ఇంది. కుండపోత వర్షంలో సదరు క్యాడెట్లను తల నేలకు ఆనేలా ఒంగోబెట్టారు, అయితే అది సరిగా చేయలేని వారిని కర్రలతో అత్యంత అమానుషంగా కొట్టారు. ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేస్తూ యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి :Bear: ఎట్టకేలకు చెట్టు దిగిన ఎలుగు బంటి..ఊపిరి పీల్చుకున్న జనం
వీడియో చూసి షాక్ తిన్నామని.ఈ వ్యవహారం జోషి-బెడేకర్ (Joshi-Bedekar) అనే కాలేజీకి సంబంధించినది. సుమారు 8 మంది విద్యార్థులను వరుసగా పుష్-అప్ పొజిషన్లో పడుకోబెట్టారు. విద్యార్థులు బురదలో తలలు పెట్టుకున్నారు. ఒక సీనియర్ విద్యార్థి చేతిలో చెక్క కర్రతో నిలబడి ఉన్నాడు. ఏ విద్యార్థి అయినా కొంచెం కదిలితే చెక్క కర్రలతో కనికరం లేకుండా కొట్టడం (beating) వీడియోలో చూడొచ్చు. కొట్టడం అమానుషంగా ఉండడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.నిందితులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు (Netizens) డిమాండ్ చేస్తున్నారు.
చదవండి :లైంగిక వేధింపులపై మాట్లాడినందుకు పరీక్షలో ఫెయిల్: తెలంగాణ వైద్య విద్యార్థి