Samantha : బ్యూటీ క్వీన్ సమంత ఈజ్ బ్యాక్.. కానీ ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు అనుకోలేదు. అమ్మడు అసలు కోలుకుంటుందా.. అనే డౌట్స్ కూడా వచ్చాయి.. ఎందుకంటే మయోసైటిస్ కారణంగా తన పరిస్థితి దారుణంగా ఉందని కన్నీరు పెట్టుకుంది. కానీ సామ్ ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగో, మెంటల్‌గాను అంతే స్ట్రాంగ్. అందుకే త్వరగా కోలుకుంది. ఇంకేముంది.. వెంటనే ఫీల్డ్‌లోకి దిగిపోయింది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం కసరత్తులు చేస్తోంది.
బ్యూటీ క్వీన్ సమంత ఈజ్ బ్యాక్.. కానీ ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు అనుకోలేదు. అమ్మడు అసలు కోలుకుంటుందా.. అనే డౌట్స్ కూడా వచ్చాయి.. ఎందుకంటే మయోసైటిస్ కారణంగా తన పరిస్థితి దారుణంగా ఉందని కన్నీరు పెట్టుకుంది. కానీ సామ్ ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగో, మెంటల్‌గాను అంతే స్ట్రాంగ్. అందుకే త్వరగా కోలుకుంది. ఇంకేముంది.. వెంటనే ఫీల్డ్‌లోకి దిగిపోయింది. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం కసరత్తులు చేస్తోంది. తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తోన్న ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకుంది. ఈ బ్యాక్ సైడ్ వీడియో కాస్త బోల్డ్‌గానే ఉంది. వర్కౌట్ వల్ల తాన బాడీకే కాదు.. కుర్రకారుకు కూడా చెమటలు పట్టించేలా ఉంది అమ్మడి హాట్ షో. ఈ లెక్కన సమంత ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడి వరకు బాగనే ఉన్నా.. అసలు మయోసైటిస్ బారిన పడడానికి కారణమే హెవీ వర్కౌట్స్. కానీ సమంత మాత్రం ఇంకా గట్టిగా చెమటలు చిందిస్తోంది. అమ్మడు ఇలాగే కేర్లెస్గా ఉంటే.. మళ్లీ హెల్త్ ఇష్యూస్ ఫేజ్ చేయాల్సిందేనా.. అనేది ఫ్యాన్స్ డౌట్. ఇకపోతే.. యశోద తర్వాత సమంత నుంచి శాకుంతలం మూవీ.. విజువల్ వండర్‌గా పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది. త్వరలోనే ఈ సినిమా రీలీజ్ కానుంది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అవబోతోంది. ఏదేమైనా సమంత మళ్లీ గ్లామర్ షో మొదలుపెట్టిసిందని చెప్పొచ్చు.