»Rats Roaming In Irctc Food Stalls In Madhya Pradesh Bhopal Video Viral
IRCTC ఫుడ్ స్టాల్స్‌లో తిరుగుతున్న ఎలుకలు.. వీడియో వైరల్
ఇండియన్ రైల్వే వ్యవస్థ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. రోజుకు లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. చాలా మంది ప్లాట్ ఫామ్స్‌లో దొరికే ఆహారాన్ని, అలాగే ట్రైన్లలో అమ్మె ఆహారాన్ని తింటుంటారు. మరి వాటి శుభ్రత ప్రమాణాలు ఎలా ఉంటాయో తెలిసిందే. తాజాగా ఐఆర్సీటీసీ ఫుడ్ స్టాల్స్‌లో ఎలుకలు తిరగే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
IRCTC: భారతదేశంలో వ్యవసాయం తరువాత అతిపెద్ద సేవా వ్యవస్థ రైల్వే(Railway) పరిశ్రమ. రోజుకు లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. చాలా మంది వారితో పాటే తినుబండారాలను ఇంటినుంచి తీసుకెళ్తారు. మరికొందరు ప్లాట్ ఫామ్స్‌లో దొరికే ఆహారం, లేదా రైళ్లలో అమ్మొచ్చే ఆహారాన్ని తింటారు. ఆ ఆహారం నాణ్యత ఎలా ఉంటుందో తెలిసినప్పటికీ తప్పని పరిస్థితిల్లో తింటుంటారు. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఐఆర్సీటీసీ ఫుడ్ స్టాల్లో ఎలుకలు ఇష్టారీతిగా తిరుగుతున్నాయి.
ప్రయాణికుడు తీసిన ఈ వీడియో ట్రైన్ వాలే భయ్య అనే పేరుకు ట్యాగ్ చేశాడు. దాంతో వీడియో వైరల్ అయింది. దీనిపై చాలా మంది ప్రయాణికులు స్పందించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనిపై రైల్వే అధికారులు స్పందించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని, సదరు ఫుడ్ స్టాల్‌పై తగిన చట్టపరమైన చర్యలు చేపడుతామని వెళ్లడించారు.
Rats on IRCTC food Inspection Duty 🤢 The Reason why i avoid eating food from Railway Station Vendors!!