»Railway Minister Shares Glimpses Of Indias First Bullet Train Station
Bullet Train అదిరింది.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును మించి
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ బుల్లెట్ ట్రైన్ రైల్వేస్టేషన్ వీడియోను షేర్ చేశారు. అది రైల్వేస్టేషనా..? లేదంటే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టా అనే సందేహాం కలుగుతోంది.
Railway Minister Shares Glimpses Of India's First Bullet Train Station
Bullet Train: అహ్మదాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ (Bullet Train) రైల్వేస్టేషన్ అత్యాధునికంగా నిర్మించారు. దీనిని చూస్తే ఇది నిజంగా రైల్వేస్టేషనేనా అనే సందేహాం కలుగక మానదు. ఎందుకంటే.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఉండే హంగులన్నీ ఇందులో ఉన్నాయి. ఆ రైల్వేస్టేషన్ గ్లింప్స్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అహ్మదాబాద్- ముంబై (mumbai) మధ్య నిర్మిస్తోన్న హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రైలు మార్గం 508 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందులో 26 కిలోమీటర్ల మేర సొరంగాలు ఉన్నాయి. 10 కిలోమీటర్ల మేర వంతెనలు, 7 కిలోమీటర్ల మేర కట్ట కూడా ఉన్నాయి.
బుల్లెట్ రైల్వేస్టేషన్ (Bullet Train) విషయానికి వస్తే 1.33 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. హబ్ భవనంలో కార్యాలయాలు, వాణిజ్య కేంద్రాలు, ప్రయాణికుల కోసం రిటైల్ ఔట్ లేట్లతో జంట నిర్మాణాలు ఉన్నాయి. ఆ రైల్వే స్టేషన్ వీడియో మాత్రం ఆకట్టుకుంది. చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్య పోతున్నారు.