కింగ్ కోబ్రాకు నీళ్లందించి ప్రాణం పోసాడు ఓ వ్యక్తి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఖాళీగా ఉన్న ఓ ఇంటికి రూ.7.7 లక్షల వరకూ కరెంట్ బిల్లు వచ్చింది. విద్యుత్ అధికారులకు సమస్యను విన్నవించినా సరైన సమాధానం లేదు. విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరిగినా నిర్లక్ష్యపు సమాధానమే వినిపించింది. సమస్యను సట్టించుకునేవారే లేక ఉప్పల్ లోని బాధితురాలు శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
60 ఏళ్ల చైనీస్ బామ్మ 20 ఏళ్ల అమ్మాయిలకు పోటీ ఇస్తోంది. ప్రస్తుతం తన నడుము కొలత 27 అంగుళాలు అని చెబుతోంది.
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ జూన్ నెల జీతం నుంచే అందనున్నాయి.
పవిత్ర కేదార్‌నాథ్ ఆలయంలో ఓ మహిళ అపచారం చేసింది. శివలింగంపై ఆ మహిళ నోట్ల కట్టలను చల్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన(Upasana Konidela) మంగళవారం రోజు జూన్ 20న బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ప్రాణ హాని లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఆదిపురుష్ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఆదిపురుష్ డైలాగ్స్ మరో వారం రోజుల్లో మార్చి ప్రదర్శితమవుతున్న సినిమాలో చేరుస్తున్నట్లు తెలిపారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య వాదనలు జరుగుతున్నాయి. నటులు సినిమాల కోసం అడ్వాన్స్ లు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదని నిర్మాతలు రచ్చకెక్కారు. దీనిపై విచారణ జరగనుంది. ఇందులో నటులకు రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయ్యింది. అధికారులు దాడులు చేయగా 400 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
ఢిల్లీ మెట్రోలో ఓ యువతి హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంది. ఆ వీడియో చూసి నెటిజన్లు దుమ్మతి పోశారు.
కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో సత్యభామ అనే మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యరీత్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్ సరికొత్త ప్రయోగం చేయనుంది. త్వరలోనే ట్విట్టర్ వీడియో యాప్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. విశాఖ పట్నం నుంచి వస్తుండగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.