Rakesh Master:ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. విశాఖ పట్నం నుంచి వస్తుండగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
Rakesh Master:సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. విశాఖ పట్నం నుంచి వస్తుండగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాకేష్ మాస్టర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కాగా రాకేష్ మాస్టర్ ఇటీవల సెలబ్రిటీలపై అసభ్యకర కామెంట్లు, వివాదాస్పద ఇంటర్వ్యూలు చేస్తూ యూట్యూబ్‌లో ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. మందు తాగుతూ పచ్చి బూతులు తిడుతూ వీడియోలు చేస్తూ తరచూ వివాదాల్లో నిలుచిన విషయం తెలిసిందే. ఆ మధ్య కొన్ని ఎపిసోడ్ లలో జబర్దస్త్ లో మెరిసిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతి పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
చదవండి:Manipur violence:మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై RSS ఆందోళన
ఆయన డ్యాన్స్ మాస్టర్‌గా దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. రాకేష్ మాస్టర్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. చాలా మంది డ్యాన్స్ మాస్టర్ల వల్ల తన కెరీర్ నాశనం అయిందని యూట్యూబ్‌లో ఆరోపణలు చేస్తూ చాలా చాలా ఫేమస్ అయ్యాడు. దీంతో ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆయన మరణవార్తతో టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.