ప్రముఖ టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్‌కు 'కానిస్టేబుల్' సినిమా షూటింగ్‌లో కాలికి గాయం అయ్యింది. వైద్యులు ఆయన్ని మూడు వారాల వరకూ విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు.
తమిళనాడులో స్టాలిన్ సర్కార్ ఎన్నికల హామీల్లో భాగంగా 500 మద్యం దుకాణాలను మూసి వేయనుంది. రేపటి నుంచి తొలి విడతగా 500 దుకాణాలు మూత పడనున్నాయి.
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణలో కొత్త పార్టీని ప్రకటించాడు. గద్దర్ ప్రజా పార్టీ అని తన పార్టీకి నామకరణం చేశాడు. రానున్న ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని తెలిపాడు.
గుజరాత్‌లోని తంకారలో కోతులు పానీపూరిని ఆస్వాదిస్తున్న వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో కోతి పానీపూరి దుకాణం వద్దకువచ్చి దానిపై కూర్చుంది, పానీపూరి అమ్మే అతను గోల్‌గప్పాలను సిద్ధం చేసి కోతికి అందించగా అది ఇష్టంగా తినడం కనిపిస్తోంది.
మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే మున్సిపల్ కార్పొరేషన్ యువ ఇంజనీర్ చెంపచెల్లుమనిపించారు. మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ ఇద్దరు ఇంజనీర్లను విచారించి, వారిలో ఒకరిని కొట్టగా..ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి.
హోండురాస్(honduras)లోని మహిళా జైలులో జరిగిన అల్లర్లలో 41 మంది మహిళలు చనిపోయారు. వీరిలో అనేక మంది అగ్నికి ఆహుతి కాగా. ఇంకొంత మంది బాధితులు కాల్చివేయబడ్డారు.
మనవరాలు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మీడియాతో మాట్లాడారు. మంగళవారం రోజు ఆడ బిడ్డను ప్రసాదించడం తాము ఎంతో అపురూపంగా భావిస్తున్నామని అన్నారు.
ఈ మధ్యకాలంలో అందరూ ఇంటి డెకరేషన్ కోసం బుద్ధుని విగ్రహాలు ఉపయోగిస్తున్నారు. వివిధ రూపాల్లో, ఆకారాల్లో బుద్ధుని బొమ్మలు ఆకర్షణీయంగా ఉండటంతో వాటిని పెడుతున్నారు. అయితే, వాటిని ఇంట్లో ఉంచే సమయంలో వాస్తు రూల్స్ కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజాగా బస్సులో సీట్ల కోసం ఇద్దరు మహిళల మధ్య ఫైటింగ్ జరిగింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో రష్మిక ఒకరు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆ వార్త ప్రకారం, రష్మికను ఆమె మేనేజర్ మోసం చేశాడు. దాదాపు రూ.80లక్షల డబ్బు కాజేసాడు అని వార్తలు వస్తున్నాయి. దీంతో, ఆమె అతనిని ఉద్యోగం లో నుంచి తొలగించింది అని వార్తలు రాస్తున్నారు. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే అది నిజం కాదట.
అన్యోన్యంగా ఉన్న ఓ వృద్ధ జంట స్వీట్, క్యూట్ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది.
ఆదిపురుష్ మూవీ రైటర్ మనోజ్ శుక్లా మరో వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడు అసలు దేవుడే కాదని, ఆయన కేవలం రామ భక్తుడు మాత్రమేనని వ్యాఖ్యలు చేశారు.
రూ.2 వేల నోట్లను ఇంటి నుంచే మార్చుకునేందుకు అమెజాన్ సరికొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టింది. అమెజాన్ పే బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా ఇంటి నుంచే రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. అమెజాన్ కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
తెలంగాణను రుతుపవనాలు తాకాయి. మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల తాకిడి వల్ల ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
నిద్రపోతున్న ఓ మహిళకు హార్ట్ రేట్ వేగం పెరిగింది. అలా పది నిమిషాల పాటు ఆమె గుండె వేగంగానే కొట్టుకుంటూ ఉంది. మరికొంత సమయం అయ్యుంటే ఆమె ప్రాణాలు పోయేవి. అయితే ఆమె వేసుకున్న యాపిల్ యాప్ తన ప్రాణాలను కాపాడింది. హార్ట్ రేట్ పెరిగిందని అలారం ద్వారా యాపిల్ వాచ్ తెలుపడంతో ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకుంది.