జానకీపురం సర్పంచ్ నవ్య(Sarpanch Navya) కేసు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసును జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఈ క్రమంలో విచారణ వేగవంతం చేయాలని కమిషన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నవ్యకు కాజీపేట ఏసీపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై గల ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. మూడు రోజుల్లో సమర్ప...
రష్యా దేశ సైన్యానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చిన శక్తివంతమైన సైనిక బృందం వాగ్నెర్ బృందం(Wagner group)ను అరెస్టు చేయాలని రష్యా(russia) ఆదేశించింది.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)ను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన చేసిన పనికి వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారుల పట్ల ఎలా నడుచుకోవాలో నెర్చుకోవాలని సూచిస్తున్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానికి స్వాగతం పలికారు. న్యూయార్క్ ఆకాశ వీధులో పెద్ద బ్యానర్‌ని లాగుతున్న విమానం మోడీ స్వాగత సందేశాన్ని అందించింది. బ్యానర్‌పై "అమెరికాకు చారిత్రక సందర్శన" అని రాసి ఉంది.
చష్మా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (CHASNUPP-5) ఇప్పటివరకు పొరుగు దేశంలోని అత్యంత ఖరీదైన అణు ప్రాజెక్ట్. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, రాజకీయ తిరుగుబాటుతో పాకిస్తాన్ సతమతమవుతున్న తరుణంలో, చైనా దానికి సహాయం చేయడం, భారత్‌కు వ్యతిరేకంగా ఎక్కడో ఒక కుట్రను సూచిస్తుంది.
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.
నేటి కార్పొరేట్ రోజుల్లో ఉద్యోగాలు చేసే చాలా మంది తమ పిల్లల్ని ప్రీ స్కూల్స్ లో పడేసి వెళ్తున్నారు. అయితే ఆ స్కూల్స్ జరిగే విషయాలను, పరిస్థితులను మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ బాలుడు మరో బాలుడ్ని చితక బాదిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్కూల్ సిబ్బంది పట్టించుకోకపోవడం, పిల్లల్ని సరిగా చూడకపోవడంతో తల్లిదండ్రులు ఇకనైనా అలర్ట్ అవ్వాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కేంద్ర మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ..తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు ఫోటో షేర్ చేశారు. త్వరలోనే కోలుకుని అందరి ముందుకు వస్తానని ట్వీట్ చేశారు.
ఇద్దరు విద్యార్థులు తమ ట్యూషన్ టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ ట్యూషన్ ఫీజును చెల్లించమంటూ టీచర్ అడగటంతో విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సోనియాగాంధీ సుముఖంగా ఉన్నారని టీ కాంగ్రెస్ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు.
రెండు పక్షులు కలిసి బతికాయి. కానీ విధి వారిని విడదీసేందుకు ప్రయత్నించింది. ఓ పక్షి ప్రాణాలు పోవడంతో మరో పక్షి తట్టుకోలేకపోయింది. ఆ పక్షిపైనే తలవాల్సి మరో పక్షి కూడా ప్రాణాలు వదిలింది. ప్రేమకు నిదర్శనమైన ఈ పక్షుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మిస్టర్ మస్క్(Elon Musk) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో మిస్టర్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg)తో "కేజ్ ఫైట్‌కు సిద్ధంగా ఉన్నానని" సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా బాస్ అయిన మిస్టర్ జుకర్‌బర్గ్, "నాకు లొకేషన్ పంపండి" అనే క్యాప్షన్‌తో మిస్టర్ మస్క్ ట్వీట్ యొక్క స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్(Adipurush) సినిమా..ఆది నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన సమయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తపరిచారు. రామయాణాన్ని వక్రీకరిస్తున్నారంటూ మండి పడ్డారు కొందరు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆదిపురుష్‌ని బ్యాన్(ban) చేయాలంటు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చత్తీస్ ఘడ్ సీఎం కూడా ఆదిపురుష్‌ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడ...
ప్రధాని మోదీ గౌరవార్థం వైట్‌హౌస్‌లో రాష్ట్ర విందు ఏర్పాటు చేశారు. భారత్, అమెరికాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. భారతదేశంలోని వ్యాపారవేత్తలు కూడా ఇందులో భాగమయ్యారు.
పింక్ వాట్సాప్(Pink Whatsaap) పేరుతో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పాత దానికి అప్ గ్రేడ్ వర్షన్ అని ఇందులో బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయని కేటుగాళ్లు ఊదరగొడతారు.