మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయడం కోసం విరాళంగా వచ్చిన మృతదేహాలతో ఓ వ్యక్తి వ్యాపారం చేశాడు. శరీర భాగాలను అమ్ముతూ జేబును నింపుకునేవాడు. తాజాగా అతని వ్యాపారం బయటపడింది.
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉన్న సత్యం థియేటర్ స్థానంలో ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ వెలసింది. ఈ మల్టీప్లెక్స్‌ను ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్మించారు. ఏషియన్ సత్యం మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట నిర్మించిన ఈ మాల్‌లో AAA సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు.
ఆదిపురుష్ సినిమాకు వానరం వచ్చింది. థియేటర్లో సినిమా ప్రదర్శితం అవుతుండగా వానరం రావడంతో ప్రేక్షకులు జైశ్రీరామ్ అంటూ నినదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ఫ2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మూవీ సీన్ లీక్ అయ్యిందని బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ పేసర్ శ్రీశాంత్‌తో కలిసి బైక్ మీద మహేంద్ర సింగ్ ధోని చక్కర్లు కొట్టారు. ఆ పాత వీడియో ఇప్పుడు మళ్లీ ట్రోల్ అవుతోంది.
బీపర్‌జోయ్ తుఫాను కారణంగా వందలాది గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. అనేక చోట్ల చెట్లతోపాటు విద్యుత్ స్తంభాలు నెలకూలినట్లు వెల్లడించారు.
బిపార్జోయ్ తుఫాను(Biporjoy cyclone) గుజరాత్ తీరానికి దగ్గరికి వచ్చింది. ఈరోజు(గురువారం) సాయంత్రం తీరం దాటనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షంతోపాటు తీవ్రమైన గాలులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్న 74 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ(Basara iiit)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటివల విద్యార్థిని దీపిక ఆత్మహత్య ఘటన మరవక ముందే..మరో విద్యార్థిని మృతి చెందింది. అర్థరాత్రి లిఖిత అనే విద్యార్థిని భవనంపై నుంచి దూకి మృతిచెందింది.
చెపాక్ సూపర్ గిల్లీస్, సేలం స్పార్టాన్స్ మధ్య మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తన్వర్ ఇన్నింగ్స్(Abhishek Tanwar) ముగించడానికి ఒక డెలివరీలో 18 పరుగులు ఇచ్చి సరికొత్త రికార్డును సృష్టించాడు.
ఓ మహిళ కారణంగా బాలీవుడ్ నటుడు దారుణానికి పాల్పడ్డాడు. ఫేస్ బుక్ లైవ్ సెషన్‌లో పురుగుల మంది సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తెలుసుకున్న అతని స్నేహితులు అతని ఇంటికి వచ్చిన హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఉత్తర నైజీరియా(Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ(boat) ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు 103 మంది మరణించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
సైబర్ కేటుగాళ్లు కొత్తగా మరో స్కాం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ముద్రాయోజన పథకం(Mudra Yojana scheme) ద్వారా మీరు రూ.20 లక్షల లోన్( rs 20 lakh loan) పొందేందుకు అర్హులని పలువురి ఫోన్లకు మెసేజులు పంపింస్తున్నారు. అంతే నిజమని నమ్మి స్పందిస్తే ఆయా బాధితుల ఖాతాల నుంచి నగదు లూటీ చేస్తున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వివరణ ఇచ్చింది.
భారతదేశంలో అత్యంత ఖరీదైన స్టాక్‌గా MRF అగ్రస్థానంలో నిలించింది. మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్లో MRF షేర్లు 1.37% పెరిగి 52 వారాల సరికొత్త గరిష్ట స్థాయి రూ.100,300కి చేరుకుని ఈ ఘనతను సాధించింది.
మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ పై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలోనే పలువురు ఖాతాలు బ్లాక్ చేశామని ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే(Jack Dorsey) పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సైతం స్పందించారు.
బ్రిజ్‌భూషణ్‌పై మహిళా రెజ్లర్లు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు నోటీసులు ఇచ్చారు. లైంగిక వేధింపులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆధారాలు సమర్పించాలని రెజ్లర్లను పోలీసులు ఆదేశించారు.