ఓ వృద్ధుడికి ఇద్దరు పోలీసులు(police) సహాయం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన పప్పును పోలీసులు ఓపికతో సేకరించి సంచిలోకి ఎత్తారు. ఇది చూసిన నెటిజన్లు వారు చేసిన పనికి అభినందనలు తెలియజేస్తున్నారు.
బీహార్(Bihar)లోని నలంద, షరీఫ్‌లోని రెండు మూడు చోట్ల శనివారం రాత్రి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మరోవైపు ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని బీహార్ పోలీసులు చెప్పారు.
ప్రముఖ తమిళ్ హీరో విజయ్ సేతుపతి(vijay sethupathi) పొలిటికల్ ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంకే స్టాలిన్(mk stalin) 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజా జీవితాన్ని స్మరించుకునే ఎగ్జిబిషన్ కార్యక్రమానికి హాజరైన క్రమంలో సేతుపతి మాట్లాడారు. ఆ క్రమంలో తనకు రాజకీయాల గురించి మొత్తం తెలుసని..యువత కూడా తెలుసుకోవాలని అన్నారు.
పాకిస్థాన్(pakistan)లోని కరాచీ(karachi)లోని ఉచిత రేషన్ పంపిణీ కేంద్రంలో పిండి కోసం శుక్రవారం తొక్కిసలాట(Stampede) జరిగి 12 మంది మృతి చెందారు. మరికొంత మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని వారు ధృవీకరించారు.
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై ఆరెస్సెస్(RSS) కార్యకర్త కమల్ బదౌరియా హరిద్వార్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఏప్రిల్ 12న ఈ కుసు విచారణకు రానుంది. ఆర్‌ఎస్‌ఎస్ సభ్యలు 21వ శతాబ్దపు కౌరవులని రాహుల్ గాంధీ హర్యానాలో వ్యాఖ్యలు చేశారు.
ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంత్ అంబానీ(Anant Ambani), అతనికి కాబోయే భార్య రాధికా మర్చంట్(Radhika Merchant) కలిసి పాల్గొన్నారు. ముకేష్ అంబానీ కుమారుడు బ్లాక్ కలర్ సూట్ ధరించగా, రాధిక అద్భుతమైన నలుపు చీరను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Disha Patani : సోషల్ మీడియాలో హీరోయిన్లు ఇచ్చే గ్లామర్ ట్రీట్.. సినిమాల్లో కూడా ఉండడం లేదు. అలాంటి వారిలో యంగ్ బ్యూటీ దిశా పటాని టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అసలు ఈమె షేర్ చేసే ఫోటోలు చూస్తే.. పాపం కుర్రకారు పరిస్థితేంటని.. అనిపించక మానదు.
దేశంలోని చాలా ప్రాంతాలలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం వెల్లడించింది. మధ్య, తూర్పు, వాయువ్య భారతంలోని అనేక ప్రాంతాల్లో ఈ హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
2014లో మోదీ ఇస్తానన్న నల్లధనం డబ్బులు రూ.15 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి’ అని చెప్పి.. నమ్మారా ఇది? నమ్మితే మీరు ఏప్రిల్ ఫూల్ అయ్యారు
మోసం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా! ఓ చిన్న పొరపాటుతో ఆమె నాటకం బయటపడింది. నాటకం బహిర్గతం కావడంతో ఆమె జైలు పాలైంది.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా(Parineeti chopra), ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా(Raghav Chadha) త్వరలో పెళ్లి బాజాలు మోగించబోతున్నారా? చాలా సందర్భాలలో వీరిద్దరూ కలిసి కనిపించిన క్రమంలో ప్రస్తుతం బాలీవుడ్, రాజకీయ వర్గాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇటీవల పరిణీతి చోప్రా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఆ క్రమంలో ఫొటో గ్రాఫర్లు ఆమెను పెళ్లి వార్త గురించి అడుగగా ఆమె నవ్వుకుంటూ వెళ్లిపోయి...
Sharukh Daughter:కూతురు సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ప్రేమలో ఉన్నారా? అంటే ఔననే అంటోంది సోషల్ మీడియా. ఇటీవల వీరు తరచూ కలిసి కనిపించారు. ఓ బర్త్ డే వేడుకలో కూడా సుహానాకు అగస్త్య ప్లైయింగ్ కిస్ ఇచ్చాడు.
దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్ల పైన నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి.
శ్రీరామనవమి (Sri Rama Navami) పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) నిర్వహించిన శోభాయాత్రలో మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే (Nathuram Godse) పోటో దర్మనం ఇవ్వడం కలకలం స్పష్టించింది. గురువారం దూల్‌పేట్‌లో ఆకాష్ పూరి హనుమాన్ మందిర్(Hanuman Mandir) లో ప్రత్యేక పూజల నిర్వహించిన అనంతరం రాజాసింగ్ ఈ శోభాయాత్రను ప్రారంభించారు.
హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఒక ఇడ్లీ(idlis) ప్రేమికుడు ఏడాది కాలంలో ఇడ్లీల కోసం కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మేరకు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ(swiggy) గురువారం అతని వివరాలను వెల్లడించింది. అతను సగటును రోజుకు 23 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, స్నేహితులు, అతని కుటుంబ సభ్యుల కోసం చేసిన ఆర్డర్‌లతో సహా ...