»12 People Were Killed In A Stampede Food Distirbution For Flour At Karachi Pakistan
Food Stampede: పిండి కోసం ఎగబడ్డ జనం..12 మంది మృతి
పాకిస్థాన్(pakistan)లోని కరాచీ(karachi)లోని ఉచిత రేషన్ పంపిణీ కేంద్రంలో పిండి కోసం శుక్రవారం తొక్కిసలాట(Stampede) జరిగి 12 మంది మృతి చెందారు. మరికొంత మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని వారు ధృవీకరించారు.
ఇండియా పొరుగు దేశమైన పాకిస్థాన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కరాచీ( karachi)లో రంజాన్ సందర్భంగా ఉచిత రేషన్ పంపిణీ కేంద్రంలో పిండి కోసం శుక్రవారం తొక్కిసలాట జరిగి 12 మంది మరణించారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఎక్కువ మంది 40 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ఉన్నారని.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని రెస్క్యూ అధికారులు(officers) తెలిపారు.
అయితే పంపిణీ కేంద్రం వద్ద కొంతమంది అనుకోకుండా కరెంట్ వైరుపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి(electric shock) గురై తొక్కిసలాట జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆ క్రమంలో అక్కడికి వచ్చిన ప్రజలు ఒకరిని ఒకరు తోసుకుంటూ పరుగులు తీశారని వెల్లడించారు. మరోవైపు ఆ క్రమంలో భయాందోళనలో ఇంకొంత సమీపంలోని డ్రెయిన్లో కూడా పడిపోయారని చెప్పారు.
ఇస్లామిక్ పవిత్ర నెల ఉపవాసం ప్రారంభమైనప్పటి నుంచి రంజాన్ ఆహార పంపిణీ కేంద్రాల్లో జరిగిన అత్యంత ఘోరమైన తొక్కిసలాట(Stampede)లో ఇది కూడా ఒకటని అధికారులు అంటున్నారు. ఈ ఘటనతో పాకిస్తాన్ వ్యాప్తంగా ఉచిత ఆహార కేంద్రాల వద్ద తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య గత వారం నుంచి 22కు పెరిగిందని అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఉచిత రేషన్ పంపిణీ, సంక్షేమ పనుల గురించి తెలియజేయాలని అక్కడి ముఖ్యమంత్రి ఆదేశించారు. మరోవైపు ఆ ఘటనలో ప్రాణాలు వారి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో గత వారం పాకిస్థాన్(pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ క్రమంలో పేదలకు ఫ్రీగా గోదుమ పిండి సహా పలు ఉత్పత్తులను అందజేస్తున్నారు. పాకిస్తాన్ ఫిబ్రవరి నుంచి USD 1.1 బిలియన్ల బెయిలౌట్ ప్యాకేజీ విడుదల కోసం IMFతో చర్చలు జరుపుతోంది. అయితే వాషింగ్టన్ ఆధారిత రుణదాత విధించిన కఠినమైన షరతుల కారణంగా ఇప్పటివరకు అది అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో వారాంతపు ద్రవ్యోల్బణం ఆల్టైమ్ గరిష్ట స్థాయి 45 శాతానికి చేరుకుంది.