ప్రముఖుల ఇళ్లలో దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కుమార్తె ఐశ్వర్య నివాసంలో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దిగ్గజ గాయకుడు యేసుదాస్ (KJ Yesudas) కుమారుడు, ప్రముఖ గాయకుడు విజయ్ యేసుదాసు (Vijay Yesudas) నివాసంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. అత్యంత విలువైన ఆభరణాలు (Jewellery), వజ్రాలతో (Diamonds) పాటు ముఖ్యమైన డాక్యుమెంట్లు (Documents) చోరీకి గురయ్యాయి. ఈ సంఘటన తమిళనాడులో (Tamil Nadu) కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
యేసుదాసుకు ముగ్గురు కుమారులు. ఆ ముగ్గురిలో విజయ్ తండ్రి గాన (Singing) వారసత్వాన్ని పుచ్చుకున్నాడు. తండ్రిని మించిన గాయకుడిగా విజయ్ పేరు పొందాడు. విజయ్ తన కుటుంబంతో చెన్నైలోని (Chennai) అభిరామపురంలో నివసిస్తున్నాడు. అయితే తమ నివాసంలోని లాకర్ (Locker)లో భద్రపరచిన 60 సవర్ల బంగారు, వజ్రాభరణలు చోరీకి గురయ్యాయని విజయ్ భార్య దర్శన (Darshana) గుర్తించింది. గతేడాది డిసెంబర్ లో ఉంచిన ఆభరణాలను ఫిబ్రవరి 18వ తేదీన లాకర్ ను తెరచి చూసింది. అప్పుడు కొన్ని ఆభరణాలు లేవని గుర్తించింది. ఇంట్లో వారిని ఆరా తీశారు. అవి ఎంతకీ కనిపించకపోవడంతో తాజాగా దర్శన అభిరామపురం పోలీసులకు (Abhiramapuram Police) ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో 8 ఉంగరాలు, వజ్రాలతో పొదిగిన 5 చెవి రింగులు 24 వజ్ర ఆభరణాలు తదితర చోరీకి గురయ్యాయని పేర్కొంది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఇంట్లో వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో పని చేసే వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా విజయ్ యేసుదాసు గాయకుడిగానే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. దాదాపు వెయ్యికి పైగా పాటలు పాడాడు. ఇటు గాయకుడిగా నటుడిగా రాణిస్తున్నాడు. తమిళం, మలయాళంలో యేసుదాసు కుటుంబానికి విపరీతమైన అభిమానులు ఉన్నారు.